తెలంగాణ

telangana

ETV Bharat / state

భౌతిక దూరం పాటిస్తూ భక్తుల పూజలు - నాగుల పంచమి సందర్భంగా కామారెడ్డి మహిళల ప్రత్యేక పూజలు

నాగుల పంచమి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆలయాన్ని భక్తులతో నిండిపోయాయి. కరోనా కారణంగా మహిళలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ..ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

full of devotees in kamareddy temples
భౌతిక దూరం పాటిస్తూ భక్తుల పూజలు

By

Published : Jul 25, 2020, 2:48 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాగుల పంచమి సందర్భంగా వేకువజాము నుంచే మహిళలు ఆలయాలకు చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ... మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుట్టల దగ్గరకు వెళ్లి భక్తి శ్రద్ధలతో నాగేంద్రుడికి పాలు పోస్తున్నారు.

కరోనా లాంటి మహమ్మారి ఈ భూమి నుంచి దూరంగా పోయి మనుషులందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసినట్లు భక్తులు తెలిపారు. దేవాలయాల వద్ద మహిళలు భౌతిక దూరం పాటిస్తూ నాగ దేవతకు పూజలు చేశారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ABOUT THE AUTHOR

...view details