తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి జిల్లలో ఉచితంగా కోళ్లు.. - కామారెడ్డి

కరోనా దెబ్బకు కోళ్ల వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకూ పడిపోతున్న చికెన్ ధరలకు ఏమి చేయాలో తోచక సతమతమౌతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆటోల్లో తీసుకువచ్చి తక్కువ ధరలకు కోళ్లను విక్రయిస్తుండగా.. కామారెడ్డి జిల్లాలో మాత్రం ఓ వ్యాపారి కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

Free chickens corona blow at kamareddy
కరోనా దెబ్బకు కోళ్లు ఫ్రీ

By

Published : Mar 13, 2020, 5:54 PM IST

కరోనా భయంతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. పలు జిల్లాల్లో భయంతో కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం పెద్ద ఏడిగి రహదారి పక్కన ఓ కోళ్ల ఫారం ఉంది. అక్కడ 2500 కోళ్లు ఉన్నాయి.

కరోనా దెబ్బకు కోళ్లు ఫ్రీ

కరోనా భయంతో వ్యాపారి రాములు ఇప్పటి వరకు 500 కోళ్లను ఉచితంగా అందజేశారు. ఇంకా 2000 ఫ్రీగా ఇస్తానని చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు తీసుకునేందుకు ముందుకు వస్తుంటే.. మరికొందరు కరోనా భయంతో జంకుతున్నారు.

ఇదీ చూడండి :జగిత్యాలలో ఓ యువకునికి కరోనా లక్షణాలు

ABOUT THE AUTHOR

...view details