కామారెడ్డి జిల్లా నాగిరెడ్డపేటలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మెదక్ – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. నిజాంసాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి.. వరద నీటిని విడుదల చేసిన అధికారులు తిరిగి గేట్లు మూయడం వల్ల వరి పొలాల్లోకి నీరు చేరిందంటూ రైతులు ధర్నాకు దిగారు. నిజాంసాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలంటూ కోరారు. దాదాపు రెండు గంటల పాటు నిర్వహించిన ధర్నా వల్ల రోడ్డు మీద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.