కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఫిబ్రవరి 29న కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోసానిపేట గ్రామానికి చెందిన శిలాసాగర్ అనే మాజీ నక్సలైట్ ఆత్మరక్షణ కోసం లైసెన్స్‌డ్ రివాల్వర్ ఉపయోగిస్తున్నారు. అయితే పక్కింటి వారితో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
పోసానిపేటలో మాజీ నక్సలైట్ కాల్పుల కలకలం - FORMER NAXALITE SHOOTING IN POSANIPET
కామారెడ్డి జిల్లా పోసానిపేటలో మాజీ నక్సలైట్ లైసెన్స్‌డ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పక్కింటి వారితో అతని పిల్లలు గొడవ పడటమే కాల్పులకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఈ నెల 29న తన కొడుకు, కూతురితో పక్కింటి మహిళ మరోసారి గొడవ పడ్డారు. ఎంత సర్ది చెప్పినా వినకపోవడం వల్ల శిలాసాగర్ తన లైసెన్సు తుపాకీతో గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. కాల్పులతో భయపడిన శిలాసాగర్ కొడుకు తేజ, కూతురు శ్రీలేఖ రామారెడ్డి ఠాణాలో తండ్రిపై ఫిర్యాదు చేశారు. ఘటనపై నోటీసులు ఇచ్చి.. దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ తెలిపారు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు సీఐ తెలిపారు.
ఇవీ చూడండి:పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!
TAGGED:
పోసానిపేటలో కాల్పుల కలకలం