కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో లబ్ధిదారులకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంపీపీ మాధవి గౌడ్‌తో కలిసి జిల్లా మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ చేప పిల్లలను పంపిణీ చేశారు.
ఎల్లారెడ్డిలో లబ్ధిదారులకు చేప పిల్లల పంపిణీ - kamareddy district latest news
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ హాజరై.. పంపిణీ చేశారు.
ఎల్లారెడ్డిలో లబ్ధిదారులకు చేప పిల్లల పంపిణీ
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 2020-21 సంవత్సరానికి గానూ వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ఇస్తున్నామని పూర్ణిమ పేర్కొన్నారు. మండలంలో ఇప్పటి వరకు 10 లక్షల 19 వేల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింలు, సహకార సంఘం వైస్ ఛైర్మన్ ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.