తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రిమి సంహారక మందు శాతం ఎక్కువై చెరువులో చేపలు మృతి - velpugonda fish death

కామారెడ్డి జిల్లా వేల్పుగొండ చెరువు సమీపంలోని పొలంలో క్రిమిసంహారక మందు పిచికారీ చేయగా.. అది చెరువులో కలిసి చేపలు మరణించాయి. బుధవారం చెరువును పరిశీలించిన మత్స్యశాఖ అధికారిణి.. నీటిలో 50 కేజీల బెల్లం, 50 కేజీల ఆవు పేడ మిశ్రమం కలపితే క్రిమిసంహారక మందు తీవ్రత తగ్గుతుందని సూచించారు.

fishery officervisited velpugonda river
క్రిమి సంహారక మందు శాతం ఎక్కువై చెరువులు చేపలు మృతి

By

Published : Sep 9, 2020, 6:54 PM IST

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండలోని చెరువులో చేపలు మంగళవారం మృతి చెందాయి. జిల్లా అధికారులకు సమాచారం అందించగా.. బుధవారం ఉదయం జిల్లా మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ.. చెరువును పరిశీలించారు. చెరువును ఆనుకుని ఉన్న పొలంలో క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం వల్ల.. మందు చెరువు నీటిలో కలిసి చేపలు మృతి చెందాయన్నారు.

చెరువు నీటిని పరిశీలిస్తున్న జిల్లా మత్స్యశాఖ అధికారిణి
నీటి పీహెచ్​ విలువను చూపిస్తున్న సూచిక

పొలంలో వేసిన క్రిమిసంహారక మందు తీవ్రత పరీక్ష కోసం నీటిని సేకరించి మత్స్యశాఖ అధికారులు పరీక్షించారు. నీటి పీహెచ్​ విలువ 8.1గా ఉందని.. అమ్మోనియా శాతం 0.1 ఉందని ఆమె తెలిపారు. నీటిలో క్రిమిసంహారక మందు తీవ్రతను నశింపజేయడానికి నీటిలో 50 కేజీల బెల్లం, 50 కేజీల ఆవు పేడ మిశ్రమం కలపాలని మత్స్యకారులకు సూచించారు.

దీ చదవండి:మరాఠాల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నోటీసులు

ABOUT THE AUTHOR

...view details