తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు.. హోటల్​ దగ్ధం - కామారెడ్డి జిల్లా

ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని హోటల్​ దగ్ధమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు అంటుకొని హోటల్​ మొత్తం వ్యాపించాయి. ఘటనలో మరో హెయిర్​ సెలూన్​ పాక్షికంగా కాలిపోయింది.

ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు.. హోటల్​ దగ్ధం

By

Published : Nov 12, 2019, 8:09 AM IST

ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు.. హోటల్​ దగ్ధం
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఓ హోటల్ దగ్ధం కాగా.. మరో హెయిర్ సెలూన్ పాక్షికంగా కాలిపోయింది. చూస్తుండగానే మంటలు అంటుకుని హోటల్ అంతా వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి మంటలు ఆర్పేశారు. ప్రమాద సమయంలో హోటల్​లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details