Father Thrown His Daughter Into The Fire in Kamareddy : మద్యం మత్తులో ఏడేళ్ల కుమార్తెను ఓ తండ్రి మంటల్లోకి విసిరేశాడు. వెంటన్ స్పందించిన పొరిగింటి వ్యక్తి బాలికను కాపాడాడు. ఆ చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ దారుణం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగేడ్కి గ్రామంలో జరిగింది.
మద్యం మత్తులో కుమార్తెను మంటల్లోకి విసిరేసిన తండ్రి - Kamareddy news today
Father Thrown His Daughter Into The Fire in Kamareddy : మద్యం మత్తులో కన్నకూతురును ఓ తండ్రి మంటల్లోకి విసిరేశాడు. ఈ దారుణం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగేడ్కి గ్రామంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే?
![మద్యం మత్తులో కుమార్తెను మంటల్లోకి విసిరేసిన తండ్రి Father Thrown His Daughter Into The Fire in Kamareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-12-2023/1200-675-20398801-thumbnail-16x9-fire.jpg)
Published : Dec 31, 2023, 5:35 PM IST
|Updated : Dec 31, 2023, 10:45 PM IST
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం :కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగేడ్కి గ్రామానికి చెందిన సాయిలు, గంగాధర్ మధ్య ఘర్షణ జరిగింది. గంగాధర్‌కు చెందిన గడ్డివాముకు నిప్పంటుకుంది. అయితే సాయిలు కుమార్తే నిప్పు పెట్టిందని గంగాధర్ ఆరోపించాడు. ఈ క్రమంలోనే సాయిలుతో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సాయిలు తన కుమార్తెను మంటల్లోకి వేసేశాడు. ఇది గమనించిన గంగాధర్ గడ్డివాములోకి దూకి బాలికను సురక్షితంగా రక్షించాడు. పాపకు రెండు కాళ్లు, చెయ్యి కాలడంతో చికిత్స కోసం 108 వాహనంలో బాన్సువాడ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం స్థానికులు ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన సాయిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.