కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందంటూ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ సెల్‌టవర్ ఎక్కిన రైతులు - కామారెడ్డి జిల్లాలో సెల్‌టవర్ ఎక్కి రైతుల నిరసన
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ రైతన్నలు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు. అధికారులు సూచించిన ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అయినా కూడా కొనుగోలు చేయడం లేయకుండా ఇబ్బంది పెడుతున్నారని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ రైతులు ఆందోళనకు దిగారు.
మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ సెల్‌టవర్ ఎక్కిన రైతులు
ప్రభుత్వం కొనుగోలు చేస్తామంటేనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నామని రైతులు వెల్లడించారు. పేర్లు ఆన్లైన్లో లేవంటూ మక్కలు కొనుగోలు చేయకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారని వాపోయారు. ధాన్యం కొనుగోలు చేసేవరకు దిగేది లేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.