కామారెడ్డిలో ఇవాళ తెల్లవారుజాము నుంచి 9 గంటల వరకు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడం వల్ల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. ముందస్తు సమాచారంతో రైతులు అప్రమత్తమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పేశారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలపై అన్నదాతల ఆందోళన
కామారెడ్డి జిల్లాలో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన రైతన్నలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పేశారు.
అకాల వర్షాలపై అన్నదాతల ఆందోళన