తెలంగాణ

telangana

ETV Bharat / state

వాగులో చిక్కుకున్న రైతులు.. రక్షించిన స్థానికులు - సింగీతం వాగులో చిక్కుకున్న రైతులు

కామారెడ్డి జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిజాంసాగర్ మండలంలో సింగీతం వాగు 14 మంది రైతులు చిక్కుకుపోగా... స్థానికులు తాడు సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

farmers struck in singeetham vaag kamareddy district
వాగులో చిక్కుకున్న రైతులు.. రక్షించిన స్థానికులు

By

Published : Sep 27, 2020, 10:55 PM IST

వాగులో చిక్కుకున్న రైతులు.. రక్షించిన స్థానికులు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సింగీతం వాగులో... గ్రామానికి చెందిన 14 మంది రైతులు చిక్కుకుపోయారు. ఎప్పటిలాగే ఈ రోజు వాగు అవతల ఉన్న తమ పొలాల్లో వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో... వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల వరదలో చిక్కుకుపోయారు. స్థానికులకు సమాచారం అందించగా... తాడు సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. గ్రామానికి చెందిన ఎక్కువ మంది రైతుల పొలాలు వాగు ఒడ్డునే ఉన్నందున వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు.

ABOUT THE AUTHOR

...view details