యూరియా క్యూలైన్లలో మద్యం సీసాలు... వైరలవుతున్న వీడియో
యూరియా క్యూలైన్లలో మద్యం సీసాలు... వైరలవుతున్న వీడియో - yuria lines
ఊర్లలో రైతులు యూరియా కోసం సహకార సంఘాల వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక.. తమ చెప్పులు పెట్టి రైతులు నీడకు సేద తీరటం సర్వసాధారణంగా జరిగే విషయమే. కానీ... కామారెడ్డి జిల్లా దోమకొండలో మాత్రం రైతులు చేతికందింది లైన్లో పెట్టి తామూ క్యూలో ఉన్నమంటున్నారు. కొందరు అట్టముక్కలు, మొక్కలు, రాళ్లు పెడితే... ఇంకొందరు మాత్రం ఏకంగా మందు సీసాలను లైన్లో ఉంచారు. బారెడు పొడవున్న లైన్లో మద్యం సీసాలు పెట్టటం వల్ల ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ మీరూ ఓ లుక్కేయండి.

యూరియా క్యూలైన్లలో మద్యం సీసాలు... వైరలవుతున్న వీడియో