FARMERS PROTEST ON GRAINS PURCHASE: రోడ్డెక్కిన రైతన్న.. ధాన్యం కొనుగోలుపై పోరుబాట వడ్లు కొనాలని నినదిస్తూ పలు జిల్లాల్లో రైతులు ఆందోళన బాటపట్టారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వరి కోతలు కోసి నెల రోజులు గడుస్తున్నా.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తోందని ఆందోళన వ్యక్తం (FARMERS PROTEST ON GRAINS PURCHASE) చేశారు. జిల్లా పాలనాధికారి వచ్చి సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
కొనుగోలు కేంద్రం వద్ద భజన..
తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం (farmers protest in telangana ) చేస్తున్నారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో రైతులు 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అధికారులు (grains procurement news in telangana) పట్టించుకోవడం లేదని నిరసిస్తూ కొనుగోలు కేంద్రం వద్దే భజన చేసి వినూత్న రీతిలో అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు కలగజేసుకొని రైతులకు సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు.
వరికి అనుకూల భూముల్లో ఇతర పంటలు ఎలా..?
యాసంగిలో వరి సాగుపై ఆంక్షలు ఎత్తివేసి ప్రస్తుత సీజన్‌లో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరికి అనుకూలమైన భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు ఎలా పండిస్తారని వారు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట తెలుగు దేశం శ్రేణులు ధర్నా (grains procurement news in telangana) నిర్వహించాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలతో అన్నదాతలు నష్టపోయే అవకాశం ఉందని ఆరోపించారు.
ఓటీపీ విధానం వద్దు..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మే రైతుకు ఓటీపీ విధానం రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఓటీపీ విధానం వల్ల డబ్బులు నష్టపోతున్నామని నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థను (grains procurement news in telangana) రాష్ట్రప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ధ్వజమెత్తారు. ముందస్తు ప్రణాళిక లేకనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ఇదీచూడండి:Bjp vs TRS: రణరంగాన్ని తలపించిన బండి టూర్.. తెరాస,భాజపా శ్రేణుల బాహాబాహీ