కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తెల్ల జొన్నలు కొనుగోలు చేయాలంటూ ఆందోళన(Farmers Protest) బాట పట్టారు. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చేతులెత్తేసిందని మండిపడుతున్నారు. పిట్లం మండలం రాంపూర్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఒక్క రాంపూర్లోనే 9 వందల ఎకరాల్లో తెల్ల జొన్నలు సాగు చేశారు రైతులు.
Farmers Protest: తెల్ల జొన్నలు కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన
రైతులు ఏ పంట పండించినా అమ్ముకోవడానికి మినీ యుద్ధమే చేయాల్సి వస్తోంది. వరి ధాన్యం కొనుగోలు కోసం ఆందోళన బాట పట్టిన రైతులు తాజాగా కామారెడ్డి జిల్లాలో తెల్లజొన్నలు కొనాలంటూ అన్నదాతలు(Farmers Protest) రోడ్డెక్కారు.
రైతుల ఆందోళన
మొక్కజొన్నలకు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అధికారుల సూచన మేరకు పంట పండిస్తే కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర క్వింటాలుకు రూ.2600 ప్రకటించగా.. వ్యాపారులు, దళారులు రూ.1400 మించి చెల్లించడం లేదని చెబుతున్నారు. అకాల వర్షాలకు పంట తడిసిపోతుందని వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'ఇకపై టెట్ పరిమితి జీవితకాలం'