రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తున్న సీఎం కేసీఆర్కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రైతులంతా తెరాస పాలనలో సంతోషంగా ఉన్నారని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డితో కలిసి దేశాయిపేట్ రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
'రైతుల కష్టాలు తెలిసిన సీఎం దొరకడం మన అదృష్టం'
రైతు బంధు పథకంతో పెట్టుబడి సాయం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం మనకు దొరకడం రాష్ట్ర అదృష్టమని పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
ఈ కార్యక్రమంలో బాన్సువాడ, దేశాయిపేట్ రైతులతో పాటుగా బాన్సువాడ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ ఛైర్మన్ పాత బాలకృష్ణ, ప్యాక్స్ ఛైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Etela : హైదరాబాద్ చేరుకున్న ఈటల బృందం