దిగుబడి సరిగా రాలేదనే ఓ రైతు ఆవేదన జ్వాలై రగిలి... చెమటలు చిందించి పండించిన పంటను తగలబెట్టేలా చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. కొమిరెడ్డి నారాయణ అనే రైతు తనకున్న మూడెకరాల పొలంలో దొడ్డు రకం వరి పండించేవారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ అధికారుల సూచనలతో ఈ సారి సన్నరకం వరి సాగు చేశారు.
"సన్నరకం వరి వేసినప్పటి నుంచి పంటను చీడపీడలు ఆశించాయి. అయినా వెనుకడుగేయకుండా మందులు చల్లుతూ పంటను కాపాడుకున్నాం. ఆ తర్వాత అకాల వర్షం... ఇప్పుడు దోమ దండయాత్ర చేసింది. రసాయనాలు పిచికారీ చేశాం. అయినా లాభం లేదు."