కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కళాశాల కోసం ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పై చదువులకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ రవీందర్‌కు వినతి పత్రం అందజేశారు.
'మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి' - మద్నూర్
డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటూ కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.

'మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి'
'మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి'
ఇదీ చూడండి :"కుల వృత్తుల సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు"