తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డిలో 200 మంది పేదలకు రూ.లక్షా ఇరవైవేల సరకులు పంపిణీ - కామారెడ్డి మండలంలోని శబ్దిపూర్ గ్రామం

కరోనా వ్యాధి విస్తరిస్తోన్న నేపథ్యంలో లాక్ డౌన్ అమలు కారణంగా రోజు కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లాలో నిమ్మ మోహన్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం పేదలకు కిరాణా సామగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.

నిమ్మ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కిరాణా సామగ్రి అందజేత
నిమ్మ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కిరాణా సామగ్రి అందజేత

By

Published : Apr 21, 2020, 10:47 AM IST

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని శబ్దిపూర్ గ్రామంలో నిమ్మ మోహన్ రెడ్డి తన తండ్రి నిమ్మ రాంరెడ్డి జ్ఞాపకార్థం 200 మంది పేదలకు 1,20,000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను అందించారు. ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే, గంపగోవర్ధన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను ఏడుగురు లబ్ధిదారులకు అందజేశారు. గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే కుమారుడు శశాంక్ కిరాణా సామగ్రి, మాస్కులు, శానిటైజర్లు ఇచ్చారు. లాక్ డౌన్ క్లిష్ట కాలంలో పేదల ఇబ్బందులు కొంత మేర అయినా తగ్గించాలనే ఉద్దేశంతో తమ తండ్రి జ్ఞాపకార్థం ఈ సాయం చేశామని నిమ్మ మోహన్ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details