కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం కేంద్రంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ 50 ఆటో డ్రైవర్లలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా లాక్డౌన్ వల్ల వలస కూలీలు నడుచుకుంటూ ఇళ్లకు వెళ్తున్నారని వారికి ప్రత్యాహ్నాయ ఏర్పాట్లు చేయాలని షబ్బీర్ సూచించారు. ప్రభుత్వం వలస కూలీలకు ప్రయాణ ఖర్చులు భరించకపోతే కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
వలస కూలీలకు...
పీఆర్టీయూ ఆధ్వర్యంలో 230 మంది వలస కూలీలకు భిక్నూర్లో ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు, ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారని గంప గోవర్థన్ కొనియాడారు. తమవంతు సాయంగా పారిశుద్ధ్య కార్మికులకు 16 గ్రామాల్లో పని చేసే ఆశ కార్యకర్తలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి : 'వలస కూలీల ప్రయాణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి'