కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నుంచి ఆంక్షలతో కూడిన లాక్ డౌన్‌ను చేపట్టనున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరవాలని మున్సిపల్ ఛైర్మన్ సత్యనారాయణ పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిలో ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ - Yellareddy lockdown
కామారెడ్డి జిల్లా.. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రేపటి నుంచి ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ విధించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్ సత్యనారాయణ పలు సూచనలు చేశారు.
కామారెడ్డి జిల్లాలో కరోనా ఆంక్షలు
ఎల్లారెడ్డిలోని వ్యాపార సముదాయ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి.. ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి:పుర, నగరపాలక ఎన్నికలు నిలిపివేయలేం: హైకోర్టు