తెలంగాణ

telangana

ETV Bharat / state

బతికినందుకు బడి రుణం తీర్చుకోవాలి: సబితా ఇంద్రారెడ్డి - education minister sabitha indrareddy updates

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రంలో రూ.2 కోట్ల 95 లక్షలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ పాఠశాలను ప్రారంభించారు. దాత తిమ్మారెడ్డి సుభాష్‌రెడ్డి సొంత ఖర్చులతో మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యార్థులు పూలు చల్లుతూ, మార్చ్ ఫాస్ట్ నిర్వహించి మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

education minister sabitha indrareddy at kathurbha gandhi school inauguration in kamareddy district
బతికినందుకు బడి రుణం తీర్చుకోవాలి: సబితా ఇంద్రారెడ్డి

By

Published : Oct 30, 2020, 9:02 PM IST

విద్యారంగంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకొస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టినందుకు తల్లిదండ్రుల రుణం, బతికినందుకు బడి రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సబితా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి బీటీఎస్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్వాగతం పలికారు.

మనసున్న మనిషిగా...

మండల కేంద్రంలో రూ.2 కోట్ల 95 లక్షలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. పాఠశాల దాత తిమ్మారెడ్డి సుభాష్‌రెడ్డి సొంత ఖర్చులతో మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూలు చల్లుతూ, మార్చ్ ఫాస్ట్ నిర్వహించి మంత్రికి స్వాగతం పలికారు. మనసున్న మనిషిగా పాఠశాల నిర్మాణానికి సుభాష్ రెడ్డి ముందుకొచ్చారని మంత్రి కొనియాడారు.

విద్యారంగానికి పెద్దపీట

తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నిరంతరం పాటు పడుతున్నారని చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ విద్యారంగంపై సీఎం కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూశారన్నారు. రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటు చేసి విద్యారంగానికి సీఎం పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే టీవీల ద్వారా విద్యాబోధన కొనసాగుతోందన్నారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే ఎక్కువగా విద్యాబోధన అందుతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయన్నారు.

ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరిక మేరకు జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రతి రంగంలో కామారెడ్డి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్, జడ్పీ ఛైర్మన్ దఫెదర్ శోభ, వైస్ ఛైర్మన్ ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దుండిగల్​ ఓఆర్​ఆర్​ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details