తెలంగాణ

telangana

ETV Bharat / state

Lockdown : డ్రోన్​ కెమెరాల ద్వారా పర్యవేక్షణ - కామారెడ్డి జిల్లాలో లాక్​డౌన్​

కామారెడ్డి జిల్లా కేంద్రంలో లాక్​డౌన్​ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మంగళవారం నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా ప్రతి వీధిని పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

drone cameras surveillance in kamareddy
కామారెడ్డిలో డ్రోన్​ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

By

Published : May 27, 2021, 10:54 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అన్ని వీధులు, ప్రధాన రహదారులను పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. లాక్​డౌన్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా చాలామంది అవేమీ తమకు పట్టనంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు. మాస్కులు ధరించకుండా, జనాలు గుమిగూడి మాట్లాడటం, భౌతిక దూరం పాటించకపోవడం చేస్తున్నారు. అలాంటి వారిపైడ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించి పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు.

లాక్​డౌన్​ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 242 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. 3,950 మందికి జరిమానా విధించారు. 991 వాహనాలను సీజ్​ చేశారు. లాక్​డౌన్​ మినహాయింపు సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:Mango Farmers: లాక్​ డౌన్​ ప్రభావం.. మామిడి రైతులకు తీరని నష్టం

ABOUT THE AUTHOR

...view details