తెలంగాణ

telangana

ETV Bharat / state

చుక్క పడకపోయే సరికి చుక్కలు కనిపిస్తున్నాయి - కామారెడ్డి జిల్లా తాజా వార్తలు

లాక్​డౌన్ సమయంలో ఆహరం దొరక్క ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మద్యం దొరక్క పిచ్చెక్కి పోతున్నారు కొందరు. చుక్కపడకపోయే సరికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొంతమందైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు.

drinkers committed to suicide
చుక్క పడకపోయే సరికి చుక్కలు కనిపిస్తున్నాయి

By

Published : Mar 28, 2020, 6:00 PM IST

కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి మద్యం బానిసలు క్యూ కడుతున్నారు. కల్లు, మద్యం దొరక్క.. ఫిట్స్ వచ్చి, పిచ్చి చేష్టలతో దవాఖానాకు వచ్చే వారే సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫిట్స్ వచ్చి కిందపడగా.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

చుక్క పడకపోయే సరికి చుక్కలు కనిపిస్తున్నాయి

దేవునిపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి చెరువులో దూకడానికి వెళ్లాడు. స్థానికులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కారణంతోనే ఆరోగ్య సమస్యలతో ఇప్పటి వరకు కామారెడ్డి 27 కేసులు ఆసుపత్రికి వచ్చాయి. ఇందులో 25 ఏళ్లలోపు వారు ఐదుగురు ఉన్నారు.

ఇవీ చూడండి:కరోనా పేరుతో సైబర్​ మోసాలు- ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

ABOUT THE AUTHOR

...view details