కామారెడ్డి జిల్లా దోమకొండ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ బాలిక వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. 82 మంది విద్యార్థులకు చర్మంపై దురదలు, దద్దుర్లు వచ్చాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉండడం వల్ల కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బీబీపేట పీహెచ్సీ వైద్య సిబ్బంది హుటాహుటిన వసతి గృహానికి వెళ్లి బాలికలకు వైద్య సహాయం అందించారు.
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ వసతిగృహంలో బాలికలకు అస్వస్థత - సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ వసతిగృహంలో బాలికలకు అస్వస్థత
దోమకొండలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెనిషియల్ బాలికల వసతిగృహంలో 82 మంది విద్యార్థులు చర్మ సంబందిత రుగ్మతతో అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు చర్మంపై దద్దర్లతో ఇబ్బంది పడ్డారు.
![సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ వసతిగృహంలో బాలికలకు అస్వస్థత domarakonda social welfare residential educational](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5260548-thumbnail-3x2-students-rk.jpg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ వసతిగృహంలో బాలికలకు అస్వస్థత
శరీరంపై ఒక రకమైన క్రిములు పాకడం వల్ల గానీ, కరవడం వల్ల ఈ విధంగా జరిగి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. విద్యార్థినులకు ప్రాథమిక చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ వసతిగృహంలో బాలికలకు అస్వస్థత
ఇదీ చూడండి: 'బిగ్ బజార్లో నాసిరకమే కాదు... తేదీ ముగిసినవి కూడా'
TAGGED:
students suffer with rashes