తెలంగాణ

telangana

ETV Bharat / state

Machareddy Dog incident: మూగజీవిపై పైశాచికత్వం.. కుక్క మెడకు వైరు చుట్టి..! - తెలంగాణ వార్తలు

Machareddy Dog incident : మూగజీవిపై పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు ఓ వ్యక్తి. కుక్కను కొనుగోలు చేసి... దాని మెడకు వైరు చుట్టి దాదాపు 5 కిలోమీటర్ల మేర లాక్కెళ్లాడు. ఈ క్రమంలో కుక్క మెడకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన స్థానికులు అతడిని మందలించారు.

Machareddy Dog incident, dog injured
మూగజీవిపై పైశాచికత్వం

By

Published : Dec 14, 2021, 2:00 PM IST

Machareddy Dog incident : మూగజీవి పట్ల విచక్షణా రాహిత్యంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. కుక్కను కొనుగోలు చేసి... బైక్​పై ఎక్కకపోవడంతో పైశాచికత్వం చూపించాడు. కుక్క మెడకు వైర్ చుట్టి... సుమారు 5 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో కుక్క మెడకు తీవ్ర గాయమైంది. దీన్ని గమనించిన స్థానికులు... ఆ వ్యక్తికి అడ్డుపడి మందలించారు. అంతేకాకుండా కుక్కను బైక్​పై ఎక్కించి పంపించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగింది.

తాడ్వాయి మండలం కొండాపూర్​కు చెందిన కొమురయ్య అనే వ్యక్తి పందులను పెంచుతాడు. వాటి కాపలా కోసం ఓ కుక్కను కొనుగోలు చేసేందుకు మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రికి వెళ్లాడు. అక్కడ రూ.1000 ఓ కుక్కను కొనుగోలు చేశాడు. ఆ కుక్కను బైక్​పై ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేయగా... ఆ మూగజీవి సహకరించలేదు. దాని మెడకు వైరు చుట్టి... తాను బండి మీద వెళ్తూ... కుక్కను లాక్కెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు కొమురయ్యను అడ్డుకున్నారు. మూగజీవి అలా తీసుకెళ్లడం ఏంటని మందలించారు. అనంతరం స్థానికులు కుక్కను బైక్​పై ఎక్కించి పంపించారు. ఈ ఘటనలో కుక్క మెడకు గాయమైంది. ఈ ఘటన రోడ్డుపై వెళ్లే చాలా మందిని కలచివేసింది.

మూగజీవిపై పైశాచికత్వం

ఇదీ చదవండి:'చనిపోయేటప్పుడు హైపర్​ ఆది పేరునే తలచుకుంటా'

ABOUT THE AUTHOR

...view details