కామారెడ్డి జిల్లా మద్నూర్ డోంగ్లీ గ్రామానికి చెందిన జాదవ్ అనిత-శివ దంపతులు వైద్యులు, పోలీసులకు కొత్త తరహాలో కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని మద్నూర్ మండలం సలబత్ పూర్ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, పోలీసుల కాళ్లు కడిగారు. కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. కరోనా నివారణకు నిరంతరం కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులే మాకు దేవుళ్లని అనిత-శివ దంపతులన్నారు. అనంతరం అక్కడి అధికారులకు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.
వైద్యులు, పోలీసుల కాళ్లు కడిగి పూజలు - వైద్యుల కాళ్లు కడిగి పూజలు
కరోనా కట్టడి కోసం వైద్యులు, పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారి కృషిని అందరూ కొనియాడుతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఆ దంపతులు మాత్రం పోలీసులు, వైద్యులకు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి కాళ్లు కడిగి పూజ చేశారు.
వైద్యులు, పోలీసుల కాళ్లు కడిగి పూజలు