కామారెడ్డి జిల్లాలోని ఇసన్నపల్లిలో కొలువై ఉన్న కాలభైరవ స్వామిని జిల్లా కలెక్టర్ శరత్‌కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన పాలనాధికారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలభైరవ స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు.
కాలభైరవస్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు - collector sarathkumar is a special worshiper at the Kalbhairava Swamy
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి కాలభైరవస్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ శరత్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్‌కు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కాలభైరవస్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
ఆలయ సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ను స్థానికులు సన్మానించారు. ఇసన్నపల్లిని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరారు. అనంతరం సమీపంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.