తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలను సంరక్షించండి: కలెక్టర్ శరత్ - kamareddy district sadashivnagar

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలోని అవెన్యూ ప్లాంటేషన్​లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు. మొక్కల సంరక్షణకు పలు సూచనలు చేశారు.

kamareddy collector, sharat
కామారెడ్డి కలెక్టర్, శరత్

By

Published : Mar 27, 2021, 3:08 PM IST

కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ సదాశివనగర్ మండలం పరిధిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. మండలంలోని పద్మాజివాడి, భూంపల్లి, గాంధారి గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్​లో నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కోరారు.

భూంపల్లి గుట్టపై ఉన్న పల్లె ప్రకృతి వనంను సందర్శించి సంబంధిత నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి:దిల్లీ ఎయిమ్స్​కు రాష్ట్రపతి కోవింద్!

ABOUT THE AUTHOR

...view details