తెలంగాణ

telangana

ETV Bharat / state

Medicine Through Drone: వర్షంతో స్తంభించిన రవాణా... పిల్లాడికి జ్వరం.. వైద్యాధికారులు ఏం చేశారంటే? - Distribution of drugs by drones news

వర్షాలతో ఆ గ్రామంలో రవాణా స్తంభించింది. అయితే ఓ పిల్లాడికి తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో విలవిలాడిపోయాడు. దీనితో ఆ గ్రామస్థులు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్ల వినూత్న ఆలోచనతో ఆ పిల్లాడి ప్రాణాలు నిలిచాయి. అసలేం వాళ్లేం చేశారు... ఏమైదంటే... ఈ కింది కథనం ఓసారి చదవండి.

Medicine Through Drone
వర్షంతో స్తంభించిన రవాణా... పిల్లాడికి జ్వరం.. వైద్యాధికారులు ఏం చేశారంటే?

By

Published : Sep 27, 2021, 8:15 PM IST

ఆ గ్రామంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకేముంది అక్కడి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఏ ఊరుకైనా వెళ్దామంటే... చుట్టూ... నీళ్లు.. అత్యవసరమైన అదే ఊర్లో ఉండాల్సింది. ఈ క్రమంలో ఓ పిల్లాడికి తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో విలవిలాడిపోయాడు. అప్పుడు ఆ గ్రామస్థులు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వాళ్లు వినూత్నంగా ఆలోచించి.. ఆ పిల్లాడి ప్రాణాలను కాపాడారు.

డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ

అసలేం ఏం చేశారంటే...

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామానికి గత ఐదురోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి వెళ్లే దారిలో వంతెన పైనుంచి మంజీరా నది నీళ్లు పారుతున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా నిలిచిపోయింది. ఈ సమయంలో పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన కన్నయ్య 16 నెలల బాలుడికి జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీనితో కుటుంబ సభ్యులు గ్రామస్థుల ద్వారా మండల వైద్యాధికారికి సమాచారం ఇచ్చారు.

స్పందించిన అధికారులు గ్రామానికి మందులను అందించేందుకు రాగా.. లోలెవల్ వంతెన దాటే పరిస్థితి లేకపోయింది. దీంతో వాళ్లు ఓ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మండలంలోని రాంపూర్​లో అందుబాటులో ఉన్న డ్రోన్ సాయం తీసుకున్నారు. గ్రామ సమీపం నుంచి మందులను డ్రోన్​కు అందించి గ్రామస్థులకు అందించారు. బాలుడితోపాటు అత్యవసరమైన మందులను సైతం గ్రామస్థులకు వైద్యులు అందుబాటులో ఉంచారు. కుర్తి గ్రామం చుట్టూ మంజీరా నది ఉండటంతో నిజాంసాగర్ గేట్లు ఎత్తిన ప్రతిసారి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి.

ఇదీ చూడండి: Tourism Awards for RFC: రామోజీ గ్రూప్‌ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు

ABOUT THE AUTHOR

...view details