కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాట్పా చట్టం-2003 నుంచి బీడి పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు.
ఆ చట్టం నుంచి బీడీ కార్మికులకు మినహాయింపునివ్వండి: ఐఎఫ్టీయూ - కామారెడ్డి జిల్లాలో బీడీ కార్మికుల ధర్నా
బీడీ అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నిబంధనల కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఐఎఫ్టీయూ నాయకులు అన్నారు. కాట్పా చట్టం -2003 నుంచి బీడి పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు.
బీడీ అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నిబంధనల కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఐఎఫ్టీయూ నేతలు అన్నారు. బీడి పరిశ్రమను కాట్పా చట్టం-2003 నుంచి మినహాయించకపోతే సుమారు 2 కోట్లకు పైగా కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రభుత్వం వేరే ఉపాధి కల్పించలేకపోతే ప్రతీ నెల రూ. 6000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేసిన కాట్పా చట్ట సవరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో తీర్మానం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:తికమక పెట్టే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఎలా చేస్తారో తెలుసా..?