కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న 52 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనాలు చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు - mla complement municipal labor
వైరస్ కట్టడిలో అధికారులతో పాటు కార్మికుల కృషి తక్కువేమీ కాదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. వారి సేవలను కొనియాడుతూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు
నియోజకవర్గంలో కరోనాను కట్టడి చేయడంలో అధికారులతో పాటు పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయడంవల్లే కేసులు తక్కువగా నమోదయ్యాయని అన్నారు.