ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. "కౌన్ బనేగా కరోడ్ పతి" కార్యక్రమంలో రూ.25 లక్షలు గెలిచారంటూ ఎరేసి... ముందస్తు డిపాజిట్ పేరుతో లక్షలు కాజేసిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో జరిగింగి. పోసానిపేటకు చెందిన మంగల్లపల్లి లక్ష్మికి గత మార్చి నెల మొదటి వారంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కౌన్ బానేగా కరోడ్ పతి కార్యక్రమంలో రూ.25 లక్షలు గెలిచుకున్నట్లు తెలిపాడు.
కౌన్ బనేగా పేరుతో కాల్ చేశాడు.. లక్షలు కాజేశాడు! - call fraud in kamareddy
లక్షలు ఆశచూపి దొరికినంత దోచుకుంటున్నారు. ప్రజల అత్యాశే వారి పెట్టుబడి. తీయని మాటలు చెప్పి నమ్మించటమే వారి పనితనం. ఇంకేముంది... మాటల్లో పెట్టి ఉన్నదంతా కాజేస్తారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో జరిగింది.
ఆ డబ్బులు తీసుకోవాలంటే ముందస్తు ఖర్చుల కోసం కొంత డబ్బును వారి ఖాతాలో జమ చేయాలని తెలిపాడు. విషయాన్ని లక్ష్మి తన భర్తకి చెప్పింది. అదంతా మోసం... డబ్బులు వేయొద్దని భర్త హెచ్చరించాడు. భర్త మాటలు వినకుండా... అత్యాశకు పోయిన లక్ష్మి.... మొదటగా రూ.12,300 వేసింది. ఇలా పలు ఖాతాల్లో 9 సార్లు డబ్బులు వేసింది. మొత్తంగా 2 లక్షల 65 వేలు జమ చేసింది. ఆ తర్వాత గెలిచిన డబ్బుల గురించి ఒత్తిడి పెట్టేసరికి.... ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పడు అసలు విషయం తెలుసుకున్న లక్ష్మి జరిగిన మోసాన్ని పోలీసులకు వివరించింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మోసపూరిత ప్రకటనలు నమ్మి అత్యాశకు పోయి నష్టపోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అనుమానిత ఫోన్‌కాల్స్ వస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు సమాచామివ్వాలని సూచించారు.