పల్లెప్రగతి పనుల పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ క్షేత్రస్థాయి బాట పట్టారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన సీఎస్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లిలో పల్లెప్రగతి పనుల పరిశీలించారు. కార్యక్రమం వల్ల గ్రామంలో వచ్చిన మార్పుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నర్సరీ, మంకీ ఫుడ్ కోర్ట్, డంపింగ్ యార్డు, వైకుంఠ దామాలను పరిశీలించారు.గర్గుల్ గ్రామంలోని వైకుంఠధామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రావి మొక్క నాటారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పలెల్ల రూపురేఖలు మారుతున్నాయి..
సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం నేడు మూడు జిల్లాల్లో ఆకస్మిక పర్యటన చేపట్టడం జరిగిందని సీఎస్ తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్యం, ఇతర పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు రూ.308 కోట్లు నిధులు విడుదల చేయడం ద్వారా పలెల్ల రూపరేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు.