ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో నీటిపాలైంది. కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం తడిసిముద్దైంది. మద్నూర్ మండలం మంజీర నది సరిహద్దు గ్రామాల్లో వరి పంట కోత కోసి పొలాల్లో, రోడ్లపై ఆరబోశారు. ఈదురుగాలులతో భారీ వర్షం రావడంతో ధాన్యం తడిసి... మొలకెత్తిందని రైతులు వాపోయారు.
ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం.. ఆందోళనలో అన్నదాతలు - తెలంగాణ వార్తలు
అకాల వర్షాలతో రైతుల కష్టం నీటిపాలైంది. ఆరుగాలం పండించిన పంట వర్షార్పణమైంది. చేతికందివచ్చిన ధాన్యం తడిసి... మొలకెత్తిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అకాల వర్షాలతో పంట నష్టం, పంట నష్టంలో ఆందోళనలో రైతులు
చేతికందివచ్చిన పంట ఇలా నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:మెరుగు పరిస్తే.. మరింత పర్యాటకం!