తెలంగాణ

telangana

ETV Bharat / state

పంటలు వర్షార్పణం... 'ప్రభుత్వమే ఆదుకోవాలి'

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు పొలాలతో పాటు అన్నదాతల కళ్లలో నీళ్లు నింపాయి. చేతిదాకా వచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. మంజీరా నది పరీవాహక ప్రాంతాలైన నాగిరెడ్డిపేట, తాండూరు గ్రామాల్లో వరి నీట మునిగింది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

crop-lose-due-to-heavy-rains-at-kamareddy-in-telangana
పంటలు వర్షార్పణం... 'ప్రభుత్వమే ఆదుకోవాలి'

By

Published : Oct 15, 2020, 9:50 AM IST

Updated : Oct 15, 2020, 10:52 AM IST

ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో ఆరుగాలం కష్టించి పండించిన పంటలు వర్షార్పణం అయ్యాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంతో పాటు తాండూరు గ్రామంలో వరి పొలాలు నీటమునిగాయి. సింగూరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం వల్ల మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ భారీ వరద నీరు నిజాంసాగర్ జలాశయానికి చేరుతోంది. ఫలితంగా మంజీరా నది పరీవాహక ప్రాంతాలైన నాగిరెడ్డిపేట, తాండూర్ గ్రామాల్లో వరి జలమయం అయింది.

బంజారా తండా సమీపంలో ఎల్లారెడ్డి, మెదక్ ప్రధాన రహదారికి వరకు వరద నీరు చేరింది. నీళ్లపాలైన పంటలకు పరిహారం చెల్లించి... ప్రభుత్వమే తమని ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

పంటలు వర్షార్పణం... 'ప్రభుత్వమే ఆదుకోవాలి'

ఇదీ చదవండి:నీట మునిగిన 8.7 లక్షల ఎకరాలు.. పంటనష్టం రూ.1,500 కోట్లు

Last Updated : Oct 15, 2020, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details