కామారెడ్డి జిల్లాలో 108 వాహనంలో కరోనా పాజిటివ్ గర్భిణీకి 108 సిబ్బంది ప్రసవం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన పుష్ప పురిటి నొప్పులతో నిజామాబాద్ ఆస్పత్రికి రాగ కొవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలిస్తుండగా కామారెడ్డి జిల్లా రామయంపేట్ వద్ద రాగానే పుష్పకు పురిటి నొప్పులు వచ్చాయి.
అంబులెన్స్‌లో కరోనా గర్భిణీ ప్రసవం - తెలంగాణ లేటెస్ట్ వార్తలు
అంబులెన్స్‌లో కరోనా గర్భిణీ ప్రసవించిన ఘటన కామారెడ్డి రామయంపేట వద్ద జరిగింది. తల్లిబిడ్డను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అంబులెన్స్‌లో కరోనా గర్భిణీ ప్రసవం
108 సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపి కరోనా కిట్లు ధరించి మహిళకు సుఖ ప్రసవం చేశారు. పుష్ప మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.