రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట, కొండాపూర్ గ్రామాల్లోని రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. సెప్టెంబర్ 7లోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజంపేటలో పల్లె ప్రకృతి వనంలో 5 వేల మొక్కలు నాటాలని తెలిపారు.
కొండాపూర్‌లోని పల్లె ప్రకృతి వనంలో పెద్ద మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్గొండ గ్రామంలో ఒక మహిళ తనకు ఇల్లు కట్టుకోవడానికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరగా.. సానుకూలంగా స్పందించారు.