తెలంగాణ

telangana

ETV Bharat / state

'నియంత్రిత సాగు విధానం ఆలోచన విరమించుకోవాలి' - farmers problems

కామారెడ్డి జిల్లా గాంధారిలో కాంగ్రెస్​ నాయకులు ఆందోళన చేశారు. మొక్కజొన్న పంటకు ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు. నియంత్రిత సాగు విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్​ చేశారు.

congress leaders protested against regulated forming
'నియంత్రిత సాగు విధానం ఆలోచన విరమించుకోవాలి'

By

Published : May 30, 2020, 12:21 PM IST

మొక్కజొన్న పంటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ కామారెడ్డి జిల్లా గాంధారిలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. నాయకులు, రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు నియంత్రిత సాగు పేరుతో ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఏంటని టీపీసీసీ రాష్ట్ర సభ్యుడు వడ్డేపల్లి సుభాశ్​ రెడ్డి ప్రశ్నించారు.

తన భూమిలో ఏ పంట పండుతుందో ఆ పంటలే వేయొదంటూ ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరమన్నారు. ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల్లో వరి పంటలు మాత్రమే పండుతాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నియంత్రిత సాగు ఆలోచన విరమించుకోవాలని సుభాశ్​రెడ్డి డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

ABOUT THE AUTHOR

...view details