భారత్-చైనా సరిహద్దులో జరిగిన కాల్పులో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం చెందాడు. అమరుడైన అతనికి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కామప్ప కూడలి వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
వీర సైనికుడా వందనం.. కామారెడ్డిలో నివాళి - వీర జవాన్ కల్నల్ సంతోశ్ బాబు
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు వీరమణం పొందడం పట్ల కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్నల్ సంతోష్ బాబు సహా మరో ఇద్దరు సైనికులకు నివాళులు అర్పించారు.
![వీర సైనికుడా వందనం.. కామారెడ్డిలో నివాళి Congress leaders pay tribute to Jawan Colonel Santosh Babu's death in Kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7646718-297-7646718-1592336449852.jpg)
వీర సైనికుడా వందనం.. కామారెడ్డిలో నివాళి
మాతృభూమి కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వీరజవాన్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ హైమద్, కార్యకర్తలు పాల్గొన్నారు.