కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జలదీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలను అర్థరాత్రి నుంచే గృహనిర్భంధం చేశారు.
జలదీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ నేతల అరెస్టు - ఎల్లారెడ్డిలో సీనియర్ నేతల గృహనిర్భంధం
జలదీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను.. కామారెడ్డి జిల్లాలో పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలను అర్థరాత్రి నుంచే గృహనిర్భంధం చేశారు. ఎల్లారెడ్డి డివిజన్లోని ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
![జలదీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ నేతల అరెస్టు Congress leaders forcibly arrested in Kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7597767-1034-7597767-1592059793966.jpg)
జలదీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ నేతల అరెస్టు
తెల్లవారుజాము నుంచే ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డి డివిజన్లోని ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్, గాంధారి మండలాల నుంచి జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి:24 గంటల్లో 11,458 మందికి కరోనా- 386 మంది బలి