తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేయని కారణంగా పింఛన్లు తొలగించారని ఆందోళన - kamareddy  latest news

ఓటు వేయని కారణంతో తమ పింఛన్లను తొలగించారని ఆరోపిస్తూ.. మున్సిపల్ కార్యాలయం ఎదుట కొందరు ఆందోళనకు దిగారు. దీనికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.

Concern that pensions were removed due to non-voting
ఓటు వేయని కారణంగా పింఛన్లు తొలగించారని ఆందోళన

By

Published : Jan 12, 2021, 3:48 PM IST

ఎన్నికల్లో ఓటు వేయని కారణంతో తమ పింఛన్లను తొలగించారని ఆరోపిస్తూ.. కొంతమంది మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 7, 8, 9 వార్డుల్లోని 33 మంది పింఛన్లను ఓ వార్డ్ కౌన్సిలర్ భర్త తొలగించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా పాలనాధికారి శరత్​కు వినతి పత్రాన్ని అందజేశారు. పింఛన్లు తొలగి పోవడానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహించారు.

ఘటన స్థలానికి ఎస్సై మధుసూదన్ రెడ్డి చేరుకొని బాధితులతో మాట్లాడి పింఛన్లు తిరిగి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించగా.. ఆందోళన విరమించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని బాధితులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'మాస్టర్' సినిమానూ వదలని పైరసీ భూతం!​

ABOUT THE AUTHOR

...view details