తొలగించిన విద్యుత్ కనెక్షన్ను.. తిరిగి కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కూప్రియల్ గ్రామంలోని పలువురు దళితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేసవిలో.. ఇంట్లో కరెంట్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ కనెక్షన్ కల్పించండంటూ.. దళిత కుటుంబాల ఆందోళన - దళిత కుటుంబాల ఆందోళన
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం కూప్రియల్ గ్రామంలోని పలు దళిత కుటుంబాలు ధర్నా చేపట్టాయి. తొలగించిన విద్యుత్ కనెక్షన్ను.. తిరిగి కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించాయి.

విద్యుత్ కనెక్షన్ కల్పించండంటూ.. దళిత కుటుంబాల ఆందోళన
గత కొన్ని నెలలుగా విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోవడంతో, విజిలెన్స్ అధికారులు సుమారు 120కు పైగా ఇళ్లకు.. కనెక్షన్ను తొలగించారు. దాంతో పాటు.. బిల్లు చెల్లింపులో జాప్యం చేసినందుకు జరిమానా విధించారు.
ఇదీ చదవండి:డేటింగ్ యాప్‌ల వలలో చిక్కుకున్న వైద్యుడు.. ఫలితం ఖాతాలు ఖాళీ.!