తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం... కొందరి సస్పెన్షన్.. మరికొందరికి నోటీసులు

కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. హరితహారంలో నాటిన మొక్కల నిర్వహణలో అలసత్వం వహించిన పలువురు అధికారులపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది అధికారులను సస్పెండ్​ చేసి.. మరికొందరికి షోకాజ్​నోటీసులు జారీ చేశారు.

collector sharath kumar visited ramareddy village in kamareddy
పలువురు అధికారుల అలసత్వంపై ఆ కలెక్టర్​ సస్పెంషన్ వేటు​

By

Published : Jul 9, 2020, 9:46 PM IST

కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో కలెక్టర్​ శరత్​ కుమార్​ పర్యటించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ కొరకు చర్యలు చేపట్టాలని సూచించారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శి బాబును సస్పెండ్ చేసి.. సర్పంచ్ నరసింలు యాదవ్​కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

దోమకొండలో మొక్కలకు ట్రీ గార్డులు లేకపోవడం, సెలవు మంజూరు కాకున్నా పదిరోజుల నుంచి విధులకు హాజరు కానీ కార్యదర్శి అఖిలను సస్పెండ్ చేశారు. సర్పంచ్, ఎంపీఓ, అంబారిపేట్ కార్యదర్శి అజీబాబులకు షోకాజ్ నోటీసులిచ్చారు.

విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, రైతు సమస్యలపై నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారన్న నాయకుల ఫిర్యాదు మేరకు బీబీపేట ఏవో రమ్యశ్రీకి షోకాజ్ నోటిస్ జారీ చేయాలని ఆదేశించారు. పల్లెప్రగతిలో అలసత్వం వహించిన పలు గ్రామాల అధికారులపై ఆయన ఆగ్రహం వక్తం చేశారు.

ఇదీ చూడండి:అద్దె అడిగాడని ఇంటి యజమానినే చంపేశాడు!

ABOUT THE AUTHOR

...view details