పట్టణ ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 45, 46వ వార్డుల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలున్నాయని కాలనీవాసులు చెప్పడం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పట్టణ ప్రగతిలో పాల్గొన్న కలెక్టర్ శరత్ కుమార్ - పట్టణ ప్రగతిలో పాల్గొన్న కామారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 45, 46వ వార్డుల్లో కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని నిరంతరం కొనసాగించాలని తెలిపారు.
పట్టణ ప్రగతిలో పాల్గొన్న కలెక్టర్ శరత్ కుమార్
అభివృద్ధిని నిరంతరం కొనసాగాలని స్వచ్ఛ పట్టణాలుగా మార్చాలని తెలిపారు. మురుగు కాలువలను సక్రమంగా శుభ్రపరచాలని పేర్కొన్నారు. 45 వ వార్డులో గల మటన్ మార్కెట్‌ను పర్యవేక్షించి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి:పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!