కామారెడ్డి జిల్లా దోమకొండలోని పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ శరత్ పరిశీలించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అక్కడ నాటిన మొక్కలకు నీళ్లు పెట్టారు. వ్యాయామ పరికరాలను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజూ ఉదయపు నడకకు ఎంత మంది వస్తున్నారని వనసంరక్షుడిని అడిగి తెలుసుకున్నారు.
దోమకొండ పల్లె ప్రకృతి వనంలో పర్యటించిన కలెక్టర్ శరత్ - తెలంగాణ వార్తలు
ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ పల్లెప్రకృతి వనాన్ని కలెక్టర్ శరత్ సందర్శించారు. అక్కడ మొక్కలకు నీళ్లు పెట్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లింగుపల్లిలోని అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు.
మొక్కలకు నీళ్లు పెట్టిన కలెక్టర్ శరత్, కామారెడ్డి కలెక్టర్ శరత్
లింగుపల్లిలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు కలెక్టర్ శరత్ నీళ్లు పెట్టారు. ఆ వనంలో కిలోమీటర్ దూరం నడిచి పరిశీలించారు. పడిపోయిన మొక్కల కంచెలను సరిచేయాలని పంచాయతీ కార్యదర్శి అఖిలను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు జడ్పీటీసీ సభ్యుడు తిరుమల్ గౌడ్, సర్పంచ్ అంజలి, ఎంపీడీవో చెన్నారెడ్డి, ఎంపీవో తిరుపతిరెడ్డి , ఏపీవో రజినీ, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ప్రోనింగ్'తో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోండిలా..