తెలంగాణ

telangana

ETV Bharat / state

'పల్లె ప్రకృతి వనాలతో ప్రశాంత వాతావరణం నెలకొంది' - కామారెడ్డి జిల్లా తాజా వార్తలు

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని... కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే... పచ్చదనాన్ని పెంపొందించడంలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. జిల్లాలోని రామారెడ్డి మండలంలో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించారు.

Collector Sarath visited Ramareddy mandal in Kamareddy District
'పల్లె ప్రకృతి వనాలతో ప్రశాంత వాతావరణం నెలకొంది'

By

Published : Mar 9, 2021, 5:27 PM IST

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రైతు వేదికలను కలెక్టర్ డాక్టర్​ శరత్​ పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో పైప్​లైన్ లీకేజీ ఉండడంతో వైద్యాధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. రైతు వేదిక భవనంలో ఇప్పటి వరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోవడంపై వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని కలెక్టర్ అన్నారు. సదాశివనగర్ మండలం పరిధిలోని పల్లె ప్రకృతి వనాలను ఆయన సందర్శించారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే... పచ్చదనాన్ని పెంపొందించడంలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస దొంగ ఓట్లు చేర్చింది: బండి

ABOUT THE AUTHOR

...view details