తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల నిర్వాహణలో నిర్లక్ష్యం: మెడికల్ ఆఫీసర్​ బదిలీ - kaamareddy collector sharath kumaar

కలెక్టర్ శరత్ కుమార్ కామారెడ్డి జిల్లాలో డ్రైరన్ కార్యక్రమాన్ని పరీశీలించారు. విధుల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన గాంధారి మెడికల్ ఆఫీసర్​ని బదిలీ చెయ్యాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

Collector Sarath Kumar inspected the drainage program in Kamareddy district
విధుల నిర్వాహణలో నిర్లక్ష్యం: మెడికల్ ఆఫీసర్​ బదిలీ

By

Published : Jan 8, 2021, 8:05 PM IST

కరోనా వాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో భాగంగా .. కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు. వెయిటింగ్ రూమ్, వాక్సినేషన్ రూమ్, అబ్సర్వేషన్ రూమ్​ల నిర్వాహణ సరిగా లేకపోవటంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

విధుల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను.. గాంధారి మెడికల్ ఆఫీసర్​ ప్రవీణ్ కుమార్​ను మద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చెయ్యాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

ఇదీ చదవండి:తల్లి, చెల్లిపైకి ట్రాక్టర్​ ఎక్కించి.. ఇనుప రాడ్​తో కొట్టి..

ABOUT THE AUTHOR

...view details