కామారెడ్డి జిల్లా కేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో చిన్నారులకు కలెక్టర్ శరత్... పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు లక్షకు పైగా ఉన్నారని... వారందరికీ పోలియో చుక్కలు ఇప్పించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
'కామారెడ్డిని పోలియో రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం' - పిల్లలకు పోలియో చుక్కలు వేసిన కామారెడ్డి కలెక్టర్
కామారెడ్డిని పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు.
'కామారెడ్డిని పోలియో రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం'
జిల్లా వ్యాప్తంగా 638 పోలియో కేంద్రాల్లో 2,552 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. వాటితో పాటు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, టోల్గేట్ల వద్ద చుక్కలు వేస్తారని వివరించారు. కొవిడ్ నిబంధనలు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ జాహ్నవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'అవి ఎక్కువగా ఉన్నవాళ్లలోనే కొవిడ్ సమస్య తీవ్రం '