తెలంగాణ

telangana

ETV Bharat / state

హరిహర పుత్రుడి పూజలో కలెక్టర్ - telangana news

నల్గొండ జిల్లాలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన పడిపూజలో కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

collector-participated-in-ayyappa-padipooja
హరిహర పుత్రుడి పూజలో కలెక్టర్

By

Published : Dec 26, 2020, 7:19 PM IST

మిర్యాలగూడ పట్టణంలోని పులిమేడ ఆశ్రమంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన .. ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులు మాల వేసుకుని నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ దీక్షతో మానసికోల్లాసం, ఆధ్యాత్మికత పెరగటమే కాకుండా.. శారీరక దారుఢ్యంతో పాటూ ఆరోగ్యవంతులుగా తయారవుతారన్నారు.

మకరజ్యోతి దర్శనం

27 సంవత్సరాలుగా దేశిరెడ్డి శేఖర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో .. మకరజ్యోతి దర్శనానికి స్వాములను శబరిమల తీసుకు వెళ్లడం సంతోషించదగ్గ విషయమన్నారు. పట్టణంలో వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. మాలధార స్వాములకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:మోదీ ధరించిన 'ఫెరాన్'.. రైతు కూలీ కానుక

ABOUT THE AUTHOR

...view details