తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్​ - collector inspection covid ward in kamareddy government hospital

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్​ వార్డును కలెక్టర్ శరత్​కుమార్ తనిఖీ చేశారు. ​కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

collector inspection covid ward in kamareddy government hospital
collector inspection covid ward in kamareddy government hospital

By

Published : Apr 24, 2021, 7:14 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డును, ఐసీయూ వార్డును జిల్లా కలెక్టర్ శరత్​కుమార్​ తనిఖీ నిర్వహించారు. కొవిడ్ వార్డుల ముందు సెక్యూరిటీని పెంచాలని ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ… వైద్యం అందించాలని ఆసుపత్రి కో ఆర్డినేటర్ అజయ్ కుమార్​కు సూచించారు.

జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 26 శాతం నుంచి 18 శాతం వరకు తగ్గిందని తెలివారు. జిల్లా సరిహద్దుల్లో రాకపోకలను తగ్గించినట్లు వెల్లడించారు. మే 1 లోగా 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details